సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ పురస్కారాన్ని ఆర్ఆర్ఆర్ మూవీ దక్కించుకుంది.
RRR పాట “నాటు నాటు” 95వ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డుల్లోకి ఎక్కింది. హాలీవుడ్ పాటలను సైతం తలదన్నుకుంటూ చివరకు చేరిన నాటు నాటు విజయకేతంన ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. ఈ పాటను చంద్రబోస్ రచించారు. కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు.
'Naatu Naatu' from 'RRR' wins the Oscar for Best Original Song! #Oscars #Oscars95 pic.twitter.com/tLDCh6zwmn
— The Academy (@TheAcademy) March 13, 2023