ఆస్కార్ బరిలో ‘జోకర్’కు అగ్రస్థానం.. 11 నామినేషన్లతో.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్కార్ బరిలో ‘జోకర్’కు అగ్రస్థానం.. 11 నామినేషన్లతో..

January 14, 2020

Joker.

టాడ్‌ ఫిలిప్స్‌ నిర్మించిన ‘జోకర్‌’ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్‌ అవార్డుల బరిలో 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండవ  స్థానంలో మార్టిన్‌ స్కోర్సెస్‌ నిర్మించిన ‘ది ఐరిష్‌మేన్‌’, శ్యామ్‌ మెండిస్‌ నిర్మించిన ‘1917’, క్వెంటిన్‌ టరాంటినో నిర్మించిన ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ చిత్రాలు పదేసి నామినేషన్లతో నిలిచాయి. ఆ తర్వాతి స్థానంలో దక్షిణ కొరియాకు చెందిన ‘పారాసైట్‌’ చిత్రం ఆరు నామినేషన్లతో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ చిత్రానికి ఉన్న విశేషం ఏంటంటే.. మొట్టమొదటిసారిగా ఆస్కార్‌ బరిలో దక్షిణ కొరియా చిత్రం పోటీ పడడటమే. మరొక విశేషం ఏంటంటే.. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీలకు పారాసైట్ పోటీ పడడం. 

‘పారాసైట్‌’ చిత్రం భారత్‌లో ఈ నెల 31న విడుదల అవుతోంది. డాక్యుమెంటరీ కేటగిరీలో ఎక్కువమంది మహిళలు పోటీ పడ్డారు. కాగా, ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్లను వసూలు చేసిన ‘జోకర్‌’ సినిమాలో నటించిన జాక్విన్‌ ఫోనిక్స్‌కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ‘వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ ఇన్‌ హాలీవుడ్‌’ చిత్రంలో నటించిన లియోనార్డో డికాప్రియో, బ్రాడ్‌ పిట్‌లు కూడా ప్రధానంగా ఉత్తమ నటుడి అవార్డు బరిలో ఉన్నారు. అలాగే ఉత్తమ నటి అవార్డుకు  ‘బాంబ్‌షెల్‌’లో నటించిన చార్లిజ్‌ థెరాన్‌, ‘మ్యారేజ్‌ స్టోరీ’లో నటించిన స్కార్లెట్‌ జాన్సన్, ‘హరియెట్‌’లో నటించిన సింథియా ఎరివో, ‘జూడీ’లో నటించిన రెన్నా జెల్‌వెగర్, ‘లిటిల్‌ విమెన్‌’లో నటించిన సోయిస్‌ రోనన్‌లు పోటీ పడుతున్నారు.