Oscars 2023: భారత్‌కు తొలి ఆస్కార్‌ వచ్చేసింది.. - Telugu News - Mic tv
mictv telugu

Oscars 2023: భారత్‌కు తొలి ఆస్కార్‌ వచ్చేసింది..

March 13, 2023

 

Oscars 2023: First win for India with The Elephant Whisperers

2023 ఆస్కార్‌ అవార్డుల జాబితాలో భారతీయ చిత్రానికి పురస్కారం దక్కింది. డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ది ఎలిఫెంట్‌ విష్పరర్స్‌’ అవార్డును సొంతం చేసుకుంది. కార్తీక్‌, గునీత్‌లు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముంబైకి చెందిన ప్రముఖ ఫోటోజర్నలిస్ట్ కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ మూవీ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. ఈ ఏడాది మొత్తం మూడు కేటగిరీల్లో మన భారతీయ సినిమాలు నామినేషన్స్ లో ఉన్నాయి. ‘RRR’ ‘నాటు నాటు…’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకోగా, ‘ఆల్ దట్ బ్రీత్స్’ మూవీ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో, ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఉన్నాయి.
Oscars 2023: First win for India with The Elephant Whisperers

అయితే ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో నామినేట్ అయిన ‘ఆల్‌ దట్‌ బ్రెత్స్‌’కు ఆస్కార్‌ దక్కలేదు. ఈ విభాగంలో ‘నావల్నీ’ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్‌ లభించింది. ఆ నిరాశను పటాపంచలు చేస్తూ… బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో మన భారతీయ చిత్రం ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ దక్కించుకుంది. సంప్రదాయ దుస్తుల్లో అవార్డ్ అందుకున్నారు మేకర్స్ కార్తికి గాన్‌స్లేవ్స్, గునీత్‌ మోంగా.