95వ ఆస్కార్ వేడుకలకు సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో అనగా ఈనెల మార్చి 12న(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం) అస్కార్ వేడుకలు అట్టహాసంగా నిర్వహించనున్నారు. ఈసారి ఆస్కార్ రేసులో తెలుగు పాట నాటు నాటు ఉండడం ఆసక్తి రేపుతోంది. ఆర్ఆర్ఆర్ పాటకు ఆస్కార్ రావాలని తెలుగు ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ రికార్డులను ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. గోల్డెన్ గ్లోబ్, అమెరికన్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులను సొంతం చేసుకుంది.
ఇక ఆస్కార్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించేందుకు అదిరిపోయే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అస్కార్ నామినేట్ అయిన చిత్రాల యొక్క కొన్ని బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ను ఆస్కార్ వేదికపై ప్రదర్శించనున్నారు. ఆర్ఆర్ఆర్ నాటునాటు పాటను కూడా సింగర్స్ కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌లు అస్కార్ అవార్డ్స్ పాడే అవకాశం కొట్టేశారు. ఇదే సమయంలో మరో వార్త వైరల్ అవుతోంది. నాటునాటు పాటకు డ్యాన్స్ కూడా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు డ్యాన్స్ చేయడం లేదు. అమెరికన్ డ్యాన్లర్లు మాత్రం ఈ పాటకు ఆడనున్నారు. దీనికి సంబంధించిన రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. ఒకవేల తమకు డ్యాన్స్ చేసే అవకాశం వస్తే హుక్ స్టెప్ మాత్రమే వేస్తామని రామ్ చరణ్ అమెరికా మీడియా ముందు తెలిపారు.