ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ కొట్టుడు.. దద్ధరిల్లిన డాల్బీ థియేటర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ కొట్టుడు.. దద్ధరిల్లిన డాల్బీ థియేటర్

March 13, 2023

Oscars 2023: Rahul Sipligunj and Kaala Bhairava sing RRR’s ‘Naatu Naatu’

 

ఆస్కార్‌ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది.  ఈ ఏడాది మన భారతీయులకు ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే.  బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ డ్యాన్స్ పెర్ఫామన్స్ ఈ ఏడాది ఆస్కార్‌ పండగలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.

oscars-2023-rahul-sipligunj-and-kaala-bhairava-sing-rrrs-naatu-naatu

అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో మన  తెలుగు పాట ‘నాటు నాటు’ పాటను ఆస్కార్‌ వేదికగా ప్రదర్శించారు. సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అస్కార్ స్టేజ్‌పూ ఈ పాట పాడగా.. హాలీవుడ్‌ డ్యాన్సర్లు స్టెప్పులేశారు.  ఈ పాట పెర్ఫామెన్స్ జరుగుతున్నప్పుడు డాల్బీ థియేటర్‌ మొత్తం చప్పట్లతో, కేరింతలతో మార్మోగిపోయింది. పాట పాడటం పూర్తికాగానే ఆడియెన్స్‌ స్టాండింగ్‌ ఓవియేషన్‌ ఇచ్చారు.

 

 

ఆస్కార్ వేదికపై లాల్చీ పంచకట్టులో మెప్పించారు సింగర్స్ రాహుల్‌, కాలభైరవ. మరోవైపు  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ బ్లాక్‌ డ్రస్‌లో స్టైలిష్‌గా అదరగొట్టారు.  ఇక మన దర్శక దిగ్గజం రాజమౌళి భారతీయత ఉట్టిపడేలా లాల్చీ, పైజామాలో కనిపించారు.

oscars-2023-rahul-sipligunj-and-kaala-bhairava-sing-rrrs-naatu-naatu

ఇక, ఇప్పటి వరకు ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సహాయనటుడు, బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. ‘ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్’ సినిమాకు గాను జేమ్స్ ఫ్రెండ్స్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డును సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహాయనటుడిగా కే హ్యూ క్వాన్ అవార్డు అందుకోగా, ఈ ఏడాది ఉత్తమ లైవ్ షార్ట్‌గా ‘యాన్ ఐరిష్ గుడ్‌బై’కి అవార్డు దక్కింది. టామ్ బెరిక్లీ, రోజ్‌వైట్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఇక, ఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డు ‘నవల్నీ’ సొంతమైంది.