Oscars 2023: 'RRR' Fans Cheer For Ram Charan As Film Bags Nominations In Prediction List
mictv telugu

ఆస్కార్ రేసులో రామ్ చరణ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

September 17, 2022

ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పోటాపోటీగా నటించిన ఈ ఇద్దరికీ అవార్డులు పక్కా అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ఈ సినిమాకు ఆస్కార్ అవార్డుల పంట పండుతుందని ఊహించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది.

ఎన్టీఆర్ తో పాటు ఆర్ఆర్ఆర్ మూవీలో సూపర్ యాక్టింగ్ చేసిన చెర్రీ పేరు బెస్ట్ యాక్టర్ కేటగిరీలో వైరెటీ మ్యాగజైన్ పేర్కొంది. దీంతో నెట్టింట ఫ్యాన్స్ హంగామా మొదలుపెట్టారు. #RamCharanForOscars హ్యాష్ ట్యాగ్‌లో ట్విట్టర్ ట్రెండ్ చేస్తున్నారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉత్తమ నటుడి క్యాటగిరీలో ఉన్నాడని ‘వైరెటీ’ మ్యాగజైన్ ప్రిడిక్షన్ లిస్ట్‌‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికైనా ఆస్కార్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన RRR మూవీ రికార్డులను బద్దలు కొడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను అలరించింది. ఈ ఏడాది మార్చి బిగ్ స్క్రీన్లపై సందడి మొదలుపెట్టిన ఈ సినిమా.. ఆ తరువాత ఓటీటీ, బుల్లితెరపైనా అదరగొట్టేసింది. దాదాపు రూ.1200 కోట్లపైగా వసూళ్లు రాబట్టి.. మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. అదేవిధంగా నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ రోజులు ట్రెండింగ్‌లో ఉన్న చిత్రంగా రికార్డు సృష్టించింది.