ఈ మేక పాలు లీటరు రూ.300.. వాటితో ఏం చేస్తున్నారంటే..  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మేక పాలు లీటరు రూ.300.. వాటితో ఏం చేస్తున్నారంటే.. 

November 20, 2019

Osmanabad .

మేక, గొర్రెల పాల నుంచి అదో రకమైన వాసన వస్తుందని, అవి తొందరగా అరగవు అని ప్రచారంలో ఉంది. అంతుకే వాటిని తాగడానికి మనలో చాలామంది ఇష్టపడరు. కానీ, అక్కడ మేకపాలకు చాలా డిమాండ్ ఉంది. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా రైతులకు ఇప్పుడు ‘ఉస్మానాబాదీ మేక’ ఆదాయ వనరుగా మారింది. ఉస్మానాబాద్ జిల్లా అంటేనే కరువుకు మారుపేరు. అలాంటి ప్రాంతంలో ఉస్మానాబాదీ మేక వారికి జీవనోపాధిగా మారింది. దాదాపు 250 కుటుంబాలు మేక పాలతో సబ్బులను తయారుచేసి జీవనోపాధి పొందుతున్నాయి. 

25 గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలు, స్థానిక స్వచ్ఛంద సంస్థ సహాయంతో ఈ జిల్లాలోని సబ్బులను తయారు చేస్తున్నారు. శివార్‌ అనే స్వచ్ఛంద సంస్థ సీఈవో వినాయక్‌ హెగనా మాట్లాడుతూ.. ‘విటమిన్‌ ఏ, ఈలు, సెలీనియం, ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లాలు మేకపాలలో పుష్కలంగా ఉన్నాయి. ఈ పాలకు చర్మ వ్యాధులను నయం చేసే గుణం ఉంది. ఒక లీటరు ఉస్మానాబాదీ మేక పాలకు మేము రూ.300 చెల్లిస్తాం. ప్రతిరోజు పని చేసినందుకు గాను వారు రూ.150 సంపాదిస్తారు. 1,400 మేకల ద్వారా కనీసం 250 కుటుంబాలు ఈ వ్యాపారాన్ని చేస్తున్నాయి’ అని ఆయన వెల్లడించారు.