ఉస్మానియా ఆస్పత్రి.. మనుషులకా? కుక్కలకా? - MicTv.in - Telugu News
mictv telugu

ఉస్మానియా ఆస్పత్రి.. మనుషులకా? కుక్కలకా?

April 12, 2018

హైదరాబాద్‌లోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నిర్వహణ తీరు నానాటికీ దిగజారుతోంది. అసలు ఈ ఆస్పత్రి మనుషుల కోసమా, కుక్కల కోసమా అని ప్రశ్నించేంతగా సమస్యలు నెలకొన్నాయి. మేల్ సర్జికల్ రెండో వార్డులో గ్రామసింహాలు వీరవిహారం చేస్తున్నాయి. శునకాలకు సైదోడు అన్నట్లు పిల్లుకూడా హల్‌చల్ చేస్తున్నాయి. రోగుల బంధువులు ఈ సీన్లను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.


భద్రత ఉండాల్సిన ఆస్పత్రిలో, రోగులు, బలహీనులు ఉండే ప్రాంతంలో కుక్కల స్వైర విహారమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది తమ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే, వైద్యుల నుంచి పారిశుద్ధ్య సిబ్బంది వరకు అందరి తీరూ ఒక్కలాగే ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.