ఉస్మానియా వర్సిటీకి అత్యున్నత హోదా.... - MicTv.in - Telugu News
mictv telugu

ఉస్మానియా వర్సిటీకి అత్యున్నత హోదా….

September 12, 2017

వందేళ్ల పండగ జరుపుకుంటున్న ఉస్మానియా వర్సిటీ కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేసింది. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌(న్యాక్‌) ఇచ్చిన గుర్తింపులో వర్సిటీ యూజీసీ ‘ఏ ప్లస్‌’ ర్యాంకు  కొల్లగొట్టింది. జేఎన్‌టీయూ, కాకతీయ వర్సిటీలు ‘ఏ’ గ్రేడ్‌ సాధించాయి. న్యాక్ ఏ ప్లస్ పై వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాశ్వత వైస్ చాన్స్ లర్ లేకపోవడం, ఇతర సమస్యల కారణంగా

2013 తర్వాత ఈ విశ్వవిద్యాలయం గ్రేడింగ్‌ కు అప్లై చేసుకోలేదు. అన్ని హంగులూ ఉన్న వర్సిటీకి వీసీ రావడంతో యూజీసీ ‘ఏ ప్లస్‌’ హోదా ఇచ్చింది.  ఈ హోదా వల్ల జాతీయ స్థాయిలో ప్రాజెక్టులు, ఉపకార వేతనాలు, భారీగా యూజీసీ నిధులు, ఫెలో షిప్పులు దక్కాయి.