ప్రొఫెసర్ కాశీం కేసు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

ప్రొఫెసర్ కాశీం కేసు: ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

January 19, 2020

hvg

ప్రొఫెసర్‌ చింతకింది కాశీంను గజ్వేల్ పోలీసులు శనివారం ఉస్మానియా క్యాంపస్‌ అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. ఆయన్ను ఈరోజు హైదరాబాద్‌లోని హైకోర్టు చీఫ్ జస్టిస్ నివాసంలో హాజరుపర్చారు. కాశీం అరెస్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని చీఫ్ జస్టిస్ ఆదేశించారు. 

వచ్చే గురువారం వరకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి గడువు విధించారు. ఈ సందర్భంగా కాశీం కుటుంబ సభ్యులను కలవడానికి చీఫ్ జస్టిస్ అనుమతి ఇచ్చారు. దీంతో చీఫ్ జస్టిస్ నివాసంలో కాశీం తన కుటుంబ సభ్యులను కలిశారు. ఈ కేసులో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. కాశీంను పోలీసులు జైలుకు తరలించారు. ప్రొఫెసర్ కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపిస్తున్నారు. కానీ, ప్రజాసంఘాల వాదన మరోలా ఉంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే కాశీంను అరెస్ట్ చేశారని ప్రజాసంఘాల నాయకులు వాదిస్తున్నారు. చీఫ్ జస్టిస్ ఇంటి ముందు ఓయూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రొఫెసర్ కాశీంను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.