నా వల్ల కావట్లేదు.. అందుకే వెళ్లిపోతున్నా.. - MicTv.in - Telugu News
mictv telugu

నా వల్ల కావట్లేదు.. అందుకే వెళ్లిపోతున్నా..

December 3, 2017

ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన ఎమ్మెస్సీ విద్యార్థి ఇ. మురళి సూసైడ్ నోట్ లభించింది. పరీక్షల్లో పాస్ కాలేనని భయంగా ఉందని, అందుకే సూసైడ్ చేసుకుంటున్నానని రాశాడు. అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలని తన సోదరుడికి అందులో చెప్పాడు. లేఖ విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యలకు అద్దం పడుతోంది. వారిలో మానసిక ధైర్యాన్ని నూరిపోయాల్సిన అవసరాన్ని మరింతగా గుర్తుచేస్తోంది.

మురళి లేఖ ఇదీ..

‘‘ఈ స్టడీ నావల్ల కావట్లేదు. పిచ్చి లేస్తుంది. ఇంక ఇలాగే ఉంటే పిచ్చోణ్ని అయిపోతానని భయంగా ఉంది. నా వల్ల అస్సలు కావట్లేదు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి. చాలా భయంగా ఉంది. I don’t want to fail.. I never want fail in exams. I don’t know how to face this. I am sorry అమ్మా. I am really sorry. నేనేం చేయలేకపోతున్నా.. నా వల్ల కావట్లేదు భరించడం. అందుకే వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యా. I am sorry.

అన్నా.. అమ్మని ఇప్పుడు ఒంటరిగా ఉండనీయకు. మంచిగ చూసుకో అమ్మని. అరే భాస్కర్.. ఇప్పడి నుంచి అమ్మకి నువ్వే చిన్నకొడుకువి.. అర్థమైందా? I am sorry everyone. నాది సూసైడ్ అని అమ్మకి తెలియకుండా ఉంటే బాగుంటుంది.

ఈ టెన్షన్ నావల్ల కావట్లేదు. I am sorry .. goodbye everyone. I want take rest in peace. I really happy with my death. I am sorry amma. Good bye.

Murali