ఉస్మానియాలో విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తత - MicTv.in - Telugu News
mictv telugu

ఉస్మానియాలో విద్యార్థి ఆత్మహత్య.. ఉద్రిక్తత

December 3, 2017

ఉస్మానియా యూనివర్సిటీలో ఆదివారం ఎమ్మెస్సీ విద్యార్థి ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ తొలి సంవత్సరం చదువుతున్న మురళి అనే విద్యార్థి మానేరు హాస్టల్లోని 159వ నంబరు గది బాత్రూరంలో ఉరి వేసుకుని చనిపోయాడు. అతని స్వస్థలం మెదక్ అని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంత కష్టపడి చదివుతున్నా ఉద్యోగం రాలేదనే నిరాశానిస్పృహతలతో బలవన్మరణానికి పాల్పడ్డాడని తోటి విద్యార్థులు చెప్పారు. మురళి ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు నిరసనకు దిగడంతో వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం త్వరగా ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం వల్లే విద్యార్థులు నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విద్యార్థులు మరియు నిరుద్యోగ జెఏసి చైర్మన్ కోటూరి మానవతారాయ్ ఆవేదన వ్యక్తం చేశారు . మురళి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.