ఈసారి సింహాచలంలో.. బస్సులపై అన్యమత ప్రచారం - MicTv.in - Telugu News
mictv telugu

ఈసారి సింహాచలంలో.. బస్సులపై అన్యమత ప్రచారం

November 25, 2019

తిరుమల బస్సుల్లో అన్యమత ప్రచారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా సింహాచలం డిపో బస్సుపై అన్యమత ప్రచార పోస్టర్లు వివాదానికి దారి తీశాయి. హిందూ ఆలయానికి భక్తులను కొండపైకి తీసుకెళ్లే బస్సులపై ఇలా అన్యమత బోర్డులు ఎలా తగిలిస్తారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన దేవస్థానం  ట్రాన్స్ పోర్ట్ సూపరింటెండెంట్ బస్సులను నిలిపివేశారు. అందులో ఉన్న భక్తులను కిందకు దింపి మరో వాహనంలో పంపించారు. ఈ విషయాన్ని ఈవో దృష్టికి తీసుకెళ్లారు. 

Simhachalam.

కొండపైకి వెళ్లే ఆర్టీసీ బస్సులపై మెగా క్రిస్‌మస్ వేడుకలు అంటూ పోస్టర్లు అంటించారు. ఇవి హిందువుల మనోభావలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని  చూసిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం నిబంధనలకు విరుద్ధంగా అన్యమత పోస్టర్లు ఎలా అంటిస్తారని.. బస్సు డ్రైవర్ కండక్టర్‌ను నిలదీశారు. ఈ వివాదం అధికారుల దృష్టికి వెళ్లడంతో  అన్యమత ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని ఆలయ ఈవో హెచ్చరించారు. దీన్ని బస్సు డిపో మేనేజర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆ బస్సులను కొండపైకి రాకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్ధుమణిగింది.