ఎప్పటి లాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ సమ్మర్ లో థియేటర్ రిలీజ్ అయిన చిత్రాలు ఓటీటీల్లో వచ్చి సందడి చేయనున్నాయి. ఇక చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు, ఓటీటీలోనూ అలరించే చిత్రాలు రెడీగా ఉన్నాయి. అవి ఏంటో ఓ సారి చూద్దాం.
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘కడువా’, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ తనయుడు శిబిరాజ్ నటించిన ‘మాయోన్’ జులై 7(గురువారం) విడుదల కానున్నాయి. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న ‘థోర్ లవ్ అండ్ థండర్’ కూడా గురవారమే విడుదల కానుంది. హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్ గా నటించిన ‘హ్యాపీ బర్త్డే’ శుక్రవారం రిలీజ్ అవుతోంది. ఇక ‘వంగవీటి’, ‘జార్జ్ రెడ్డి’ చిత్రాలతో హీరోగా మెప్పించిన సందీప్ మాధవ్ ‘గంధర్వ’, రఘుకుంచె నటించిన ‘మా నాన్న నక్సలైట్’, ‘రుద్రసింహ’, ‘కొండవీడు’ అనే తెలుగు చిత్రాలు కూడా జులై 8 నే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఇక ఓటీటీలో కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’, నాని ‘అంటే సుందరానికి’ కూడా శుక్రవారమే విడుదల అవుతున్నాయి. ఈ లిస్ట్ లో శివరాజ్ కుమార్ నటించిన ‘జైభజరంగి’ కూడా ఉంది. సుహాసిని, ఆది పినిశెట్టి, నిత్యా మేనన్, మాళవికా నాయర్, రీతూ వర్మ, అభిజీత్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘మోడ్రన్ లవ్ ఇన్ హైదరాబాద్’ అనే వెబ్ సిరీస్ జులై 8న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రానుంది.