ఈ వారం ఓటీటీ/థియేటర్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలివే
ఈ వారం ఓటీటీ, థియేటర్లో తెలుగు చిత్రాల సందడి మామూలుగా ఉండబోవడం లేదు.. ఇప్పటికే భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, వాటి కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిన్న చిత్రాలు ఇప్పుడు వెండితెరకు క్యూ కట్టాయి. ఈ వారం జూన్ 23, 24న తేదీల్లో కుప్పలు తెప్పలుగా చిత్రాలు రాబోన్నాయి. దాదాపు తొమ్మిది చిత్రాలు రెడీగా ఉన్నాయి. కొండా, 7డేస్ 6 నైట్స్ , సమ్మతమే, గ్యాంగ్‌స్టర్ గంగరాజు, షికారు, చోర్ బజార్, సదా నన్ను నడిపే, కరణ్ అర్జున్, సాఫ్ట్‌వేర్ బ్లూస్ ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లోకి రాబోతోన్నాయి. మరోవైపు బాలీవుడ్ నుంచి ‘జుగ్ జుగ్ జియో’ సినిమా కూడా జూన్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఓటీటీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సర్కారు వారి పాట.. జూన్ 23వ తేదీ నుంచి అద్దె చెల్లించకుండా చూడొచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియోస్ తెలిపింది. జూన్ 22న డీస్నీ హాట్ స్టార్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్… తెలుగులో విడుదల కానుంది. తమిళ డబ్బింగ్ మూవీ మన్మథ లీల ఆహా లో జూన్ 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది.