ott platform aha crashes due prabhas fans, AHA
mictv telugu

డార్లింగ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా క్రాష్

December 30, 2022

ott platform aha crashes due prabhas fans

ప్రభాస్ దెబ్బకు ఆహా యాప్ క్రాష్ అయిపోయింది. టాలీవుడ్ ఫస్ట్ పాస్ ఇండియా స్టార్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండాలి. బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ షో కి విపరీతమైన పాపులారిటీ ఉంది. అసలే క్రేజీ షో, దానికి ప్రభెస్ వస్తే…మామూలుగా ఉండదు కదా. రెండు వారాలుగా ప్రభాస్ తో షో అని అడ్వర్టైజ్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ దీని కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. గురువారం షో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆ టైమ్ కు రెడీగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఒక్కసారే ఆహా యాప్ లాగిన్ అవ్వడానికి ట్రై చేశారు. దీంతో యాప్ క్రాష్ అయిపోయింది. ఓవర్ లోడ్ కారణంగా ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఆగిపోయింది.

అయితే దీనికి ఆహా సంస్థ వెంటనే స్పందించింది. ఈ సమస్యని త్వరగా పరిష్కరిస్తామని ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. డార్లింగ్ అభిమానుల ప్రేమతో మా యాప్ క్రాష్ అయింది. ఈ విషయాన్ని తెలియజేయడానికి చింతిస్తున్నాము. మేము సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నాము. త్వరలోనే షో మీ ముందు వచ్చేస్తుంది అంటూ ట్వీట్ చేసింది.