‘భీమ్లా నాయక్’లో పవన్ బైక్ కావాలా.. ఏం చేయాలంటే - MicTv.in - Telugu News
mictv telugu

‘భీమ్లా నాయక్’లో పవన్ బైక్ కావాలా.. ఏం చేయాలంటే

March 23, 2022

pavan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్’ చిత్రం ఇప్పటి వరకు రూ. 200 కోట్లను వసూలు చేసింది. కాగా ఈ చిత్రం మార్చి 24 న ఓటీటీలో విడుదలవుతోంది. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం మార్చి 25న రావాల్సి ఉండగా, ఆరోజు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల నేపథ్యంలో ఒకరోజు ముందుకు జరిపారు. ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌తో పాటు ఆహాలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఆహా ఓ ఆఫర్‌ను ప్రకటించింది. సినిమాలో పవన్ కళ్యాణ్ వాడిన రెండు బైకులలో ఒక బైకును ప్రేక్షకులకి ఇవ్వాలని భావించింది. అందుకోసం ఓ పని చేయాలని షరతు పెట్టింది. ఏప్రిల్ 1 లోగా ఆహా వీడియోను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. అలా చేసుకున్న వారిలో ఒకరికి బైకును బహుమతిగా ఇస్తామని ఆహా ప్రకటించింది. ఎవరికి దక్కుతుందో వెయిట్ అండ్ సీ అంటూ ఆహా ఊరిస్తోంది.