ott-platform-going-stream-live-95th-oscar-awards-event-india
mictv telugu

మన టీవీల్లో, మొబైల్లో ఆస్కార్ పండగ

March 7, 2023

 ott-platform-going-stream-live-95th-oscar-awards-event-india

ఆస్కార్ అవార్డులు అంటే అందరికీ క్రేజే. చాలామంది దీన్ని ఫాలో అవుతుంటారు. ఈసారి అస్కార్ అవార్డులు తెలుగువారికి మరీ స్పెషల్. మన సినిమా నామినేషన్స్ లో ఉండడమే అందుకు కారణం. అదీ కాక మన తెలుగు పాటను లైవ్ లో ఆడి, పాడుతున్నారు కూడా. ఈ సంబరాలకు అంతా సిద్ధం అయింది. మరికొన్ని రోజుల్లో అవార్డుల వేడుక వచ్చేస్తోంది. మన వాళ్ళు అందరూ అక్కడికి చేరుకున్నారు కూడా. జూ.ఎన్టీయార్ కూడా నిన్న అమెరికాకు బయలుదేరి వెళ్ళిపోయారు.

అస్కార్ అవార్డుల ఫంక్షన్ ఎప్పుడూ లైవ్ ఉంటుంది. కానీ అది కొన్ని అమెరికన్ టీవీ ఛానెళ్ళకు మాత్రమే పరిమితమయి ఉంటుంది. అయితే ఇప్పుడు అందరికీ సర్ ప్రైజ్ ఇస్తూ ఆస్కార్ అవార్డుల ఫంక్షన్ ను ఓటీటీలో లైవ్ ప్రసారం చేయనున్నారు. డిస్నీప్లస్ హాట్ స్టార్ ఈ ఈవెంట్ ను లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. మార్చి 13 ఉదయం 5.30 గంటల నుంచి ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతుంది.

టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీలో నాటునాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. దీనికి ఆస్కార్ రావడం ఖాయమనే అంటున్నారు. అదేకాక ఈ పాటను లైవ్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో భారతీయులకు మరో అట్రాక్షన్ దీపికా పడుకొనె అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా వ్యవహరించడం కూడా. ీ అవకాశం దక్కించుకున్న తొలి ఇండియన్ యాక్ట్రెస్ దీపికానే.