ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడి నుండి ఏదో గొంతు వినిపిస్తది. తెలంగాణ ఉద్యమానికి కేరాఫ్ అడ్రస్ గా నిలబడిన జాగ అస్థిత్వ ఉద్యమాలకు ఆ నేల నెలవు. ఎందుకో ఏమైందో తెలియదు సడెన్ గా ఓయూ పిఆర్వో పేరుతో పత్రికా ప్రకటన.. ఉస్మానియా యూనివర్సిటీలో ఇకనుంచి కేవలం అకడమిక్ ఆక్టివిటీసె వుండాలి అనేది ఆ ప్రకటన వుద్దేశ్యం. పరిశోధక విద్యార్థులను, టీచింగ్ స్టాఫ్ ను ఉద్దేశించి ఆ ప్రకటన విడుదల చేసారు. ఇక నుంచి ఓయూలో ఎవరూ రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆ ప్రకటన సారాశం. అంటే కొట్లాటను నేర్పిన నేలకు ఆంక్షల సంకెళ్ళన్నమాట.