నా అమ్మనాన్నలు మీరు కాదు.. బాలుడు అదృశ్యం - MicTv.in - Telugu News
mictv telugu

నా అమ్మనాన్నలు మీరు కాదు.. బాలుడు అదృశ్యం

April 27, 2022

నిండా 13 ఏళ్లు కూడా లేని ఓ బాలుడు ‘మీరు నా అమ్మనాన్నలు కారు. నా పూర్వజన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా’ అని ఫోన్‌లో వీడియో రికార్డు చేసి, ఇంట్లోంచి వెళ్లిపోయిన సంఘటన సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని న్యూ విద్యానగర్‌లో నివాసముంటున్న దంపతులకు 15, 18 ఏళ్ల ఇద్దరు కుమారులు. పిల్లలను భార్య వద్ద వదిలి భర్త వేరుగా ఉంటున్నాడు.

అయితే, పిల్లలు పాఠశాలకు వెళ్లకుండా, ఇంట్లోనే టీవీల్లో, ఫోన్‌లో పాఠాలు వింటున్నారు. ఈక్రమంలో చిన్న కుమారుడు(13) ఈనెల 1వ తేదీన వీడియో ఒకటి రికార్డు చేసి, ‘నేను పూర్వజన్మలోని తల్లిదండ్రుల వద్దకు వెళ్తున్నా’ అని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.