మా అమ్మకి రెండో పెళ్లి చేయాలని ఉంది: సుప్రిత - MicTv.in - Telugu News
mictv telugu

మా అమ్మకి రెండో పెళ్లి చేయాలని ఉంది: సుప్రిత

February 26, 2022

టాలీవుడ్‌‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖ వాణి ప్రేక్షకుల మనసులలో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలపాటు షూటింగులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తన కూతురు సుప్రితతో కలిసి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో సుప్రితకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ పెరిగింది. గత కొన్ని రోజులుగా సురేఖ రెండో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఆ వార్త బయటి వారికి ఎలా తెలిసిందో అంటూ సుప్రిత ఓ ఛానెల్‌కీ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లికి రెండవ పెళ్లి చేయాలని తనకు కూడా ఉందంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘రెండో పెళ్లి అనేది పూర్తిగా అమ్మ తీసుకునే నిర్ణయం. నాకైతే కచ్చితంగా అమ్మకి రెండో పెళ్లి చేయలనే ఉంది. అయితే, ఏం జరుగుతుందన్నది టైం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్నాం. అమ్మకి తన కెరియర్‌ కంటే నా కెరియర్‌ మీదనే ఫోకస్‌ ఎక్కువగా పెట్టింది’అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

అంతేకాకుండా తన తండ్రి మరణించిన రోజు జరిగిన సంఘటనలను తలచుకుంటూ ఎమోషనల్‌ అయింది. ‘నాన్నకు తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే నేనే పెట్టేశా. నాన్న తరపు బంధువులు అయితే చివరి చూపు చూసేందుకు రాలేదు. నాన్న స్వంత సోదరుడు.. పాడె మోయకండి అని బంధువులకు చెప్పారు. ఆ సమయంలో అమ్మ తరపు బంధువులే అన్ని దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు. ఇవన్ని ఎవరికి తెలియదు’అని సుప్రిత చెప్పుకొచ్చింది