మన విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: ఆదిమూలాపు సురేష్‌ - MicTv.in - Telugu News
mictv telugu

మన విద్యార్థులు క్షేమంగానే ఉన్నారు: ఆదిమూలాపు సురేష్‌

February 24, 2022

fbfdbc

ఉక్రెయిన్‌ దేశంలో తెలుగు విద్యార్థులు క్షేమంగానే ఉన్నారని.. మంత్రి ఆదిమూలాపు సురేష్‌ తెలిపారు. గురువారం ఉక్రెయిన్‌లో ఉ‍న్న తెలుగు విద్యార్థులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. ప్రభుత్వం విద్యార్థులను ఉక్రెయిన్‌ నుంచి రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో విమాన సర్వీసులు రద్దయ్యాయి. విద్యార్థుల సహాయం కోసం నోడల్‌ అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించాం” అని ఆయన అన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.

మరోపక్క ఉక్రెయిన్‌లో ఉండిపోయిన భారతీయ విద్యార్ధులందరు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లి తలదాచుకోవాలని అక్కడి భారత రాయబార కార్యాలయం భారతీయ విద్యార్ధులకు ముఖ్యమైన సూచనలను చేసిన విషయం తెలిసిందే. రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా తమ పిల్లలకు ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.