our time is in our hands
mictv telugu

మన టైమ్ మన చేతుల్లోనే….

December 28, 2022

our time is in our hands, time

ఈరోజుల్లో ప్రతీ ఒక్కరి నోటి వెంట వినబడుతున్న మాట అస్సలు టైమ్ ఉండడం లేదు. రోజంతా ఏదోక పని చేస్తున్నట్టే ఉంటోంది కానీ దేనికీ సమయం ఉండడం లేదు. చేయాల్సిన పనులు బోలెడు ఉండిపోతున్నాయి. ఇది చాలా మంది కంప్లైంట్. అందరికీ ఉండేవి 24 గంటలే. అయినా కొందరికే ఎందుకు సరిపోతోంది? మరికొందరికి ఎందుకు సరిపోవడం లేదు? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు మనకు టైమ్ ఎందుకు సరిపోవడం లేదు. ఇది ఎవరికి వారే వేసుకోవాల్సిన ప్రశ్న. వెతుక్కోవలసిన సమాధానమూనూ.

ముఖ్యంగా విద్యార్ధులకు టైమ్ మేనేజ్ మెంట్ గురించి తెలుసుకోవాలి. అందరికన్నా ఇది ఎక్కువ అవసరమయ్యేది వారికే. జాబులు చేస్తున్నవారు, ఇంట్లోనే ఉండేవారు అప్పటికే ఒక పద్ధతికి అలవాటు పడిపోతారు. దాని ప్రకారం వాళ్ళు టైమ్ కు చేయాల్సిన పనులు చేసేస్తుంటారు. ్ానీ విద్యార్ధులకు అలా కాదు. రోజుకు ఓ కొత్త ప్రణాళిక ఉంటుంది. చేయాల్సిన పనులు యాడ్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడే టైమ్ మేనేజ్ మెంట్ గురించి వర్రీ అవుతుంటారు.

విద్యార్ధులు ప్రతీరోజూ చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి. క్లాసులు, ట్యూషన్లకు వెళ్ళడం, ఆటలు, పాటలు, కుటుంబంతో గడపడం, సినిమాలు, షికార్లు ఇలా ఎన్నో ఉంటాయి. అన్నింటినీ మేనేజ్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తూనే సమయం వృధా కాకుండా ఉండాలంటే ఒక టైమ్ ప్రకారం అన్నీ చేసుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు తప్పకుండా పాటించాల్సినవి కొన్ని ఉన్నాయి. అవేంటో చూద్దాం.

our time is in our hands

అన్నింటికన్నా ముందు చేయాల్సినపని ఒక ప్రణాళిక వేసుకోవడం. ఇది లేకుండా ఒక పద్ధతి లేకుండా ఉంటే చాలా కన్ఫూజింగ్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఎంత చేసినా ఏదో ఇంకా చేయాలి అనే ఆలోచన ఉండిపోతుంది. దీనికోసం ముందుగా ఏయే సబ్జెక్టులు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలి అనే విషయాన్ని టైమ్ టేబుల్ వేసుకోవాలి. దాని ప్రకారం రోజూ చదువుకోవాలి, పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి. ముఖ్యంగా ఈరోజు చేయాల్సిన పనిని ఈరోజే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మర్నాటికి వాయిదా వేయకూడదు. మర్చిపోతారనుకుంటే ఒక ఛార్ట్ మీద రాసుకుని గోడకు అంటించుకోవాలి. ఇలా చేస్తే ఈరోజుది అయిపోతుంది, రేపటి ప్లాన్ కూడా పాడవదు. సమయం కూడా వృధా అవదు.

మన టైమ్ ఎంతో విలువైనది. దాన్ని అస్సలు మర్చిపోకూడదు. ఒకసారి సమయం వృధా అయితే మళ్ళీ తిరిగి రాదు. దేన్నైనా వెనక్కి తీసుకురావచ్చు కానీ కాలాన్నీ మాత్రం తీసుకురాలేము.కాబట్టి ప్రతీ నిమిషం అమూల్యమైనది. అవసరమైతే కుటుంబసభ్యులు, స్నేహితుల హెల్ప్ కూడా తీసుకోవాలి. ఏది ఏమైనా మనం అనుకున్న లక్ష్యమే మనకు ముఖ్యం అవ్వాలి.

మనం ఏపని చేసినా ఏకాగ్రత ముఖ్యం. అది లేకుండా ఏపని ఎంతసేపు చేసినా ప్రయోజనం ఉండదు. ఒకపనిని ఒకసారే చేయడం ఎంతో మంచిది. చాలా మందికి రెండు, మూడు పనులు ఒకేసారి చేయగల సత్తా ఉంటుంది. అలా ఉన్నా కానీ చదువుకున్నప్పుడు కేవలం దాని మీదనే దృష్టిపెట్టాలి. ఫోన్ చూడ్డం, కంప్యూటర్ ముందు కూర్చోడం లాంటివి చేయకూడదు.

అలాగే మనం ఏ పని చేస్తున్నామో దానికి తగ్గట్టు ప్రదేశాలు కూడా ఉండాలి. చదువుకునేటప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అందరి మధ్యలో కూర్చుని చదువుకోవడం, టీవీ ముందు, లేదా పడుకుని చదవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే చదువు మీద ఏకాగ్రత ఉండదు. ఒక కుర్చీ, టేబుల్ పెట్టుకుని, ఎదురుగా వాచ్ ను పెట్టకుని ఈ టైమ్ లో ఇంత చదవాలి అని పెట్టుకుంటే మంచింది. దీనివల్ల ఏ సబ్జెక్ట్ కి ఎంత టైమ్ కేటాయించాలి అన్నది తెలుస్తుంది. అలాగే చదివేటప్పుడు పాయింట్లను హైలెట్ చేసుకోవడానికి పెన్ ను దగ్గరగా పెట్టుకోవాలి. ిలా పాయింట్లు హైలెట్ చేసుకుంటే తర్వాత రివిజన్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అన్నీ ముందే దగ్గర పెట్టుకుని కూర్చోవాలి. మనకు కావాల్సిన వాటి గురించి పదేపదే లేవడం చేయకూడదు. అలా చేస్తే ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఒకసారి కూర్చున్నాక అనుకున్నది పూర్తయ్యేవరకూ లేవకూడదు. అలాని బుర్రలోకి వెళ్ళకపోయినా కూర్చోకూడదు. కళ్ళు చదువుతున్నా, బుర్ర దాన్ని స్వీకరించనప్పుడు కాసేపు విశాంత్రి తీసుకోవాలి. అలాంటప్పుడు ఒక పది నిమిషాల పాటూ మంచి పాటలు వినడం లాంటివి చేయాలి.

విద్యార్ధులు చేయవలసిన మరో ముఖ్యమైన పని మెడిటేషన్. ఇది వాళ్ళ కాన్సట్రేషన్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఫోకస్ కుదురుతుంది. చదివినది బాగా బుర్రలోకి ఎక్కుతుంది కూడా. కాబట్టి రోజుకు పది నిమిషాలు అయినా ధ్యానం చేస్తే మంచిది.

సమయపాలనను పాటించడంలో నిద్రకూ ప్రాముఖ్యతను ఇవ్వాలి. రోజుకు ఏడు లేదా ఎనిమిది గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. అలాంటప్పుడు ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము అన్నది కూడా చాలా ముఖ్యం. రాత్రి తొందరగా పడుకుని, ఉదయం తొందరగా లేవడం ఎప్పుడూ మంచి పద్ధతి. ఒకవేళ రాత్రి ఎక్కువ సేపు చదువుకుని, మధ్యాహ్నం వరకూ పడుకున్నా దాన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారమే చేయాలి. అప్పుడే చదువుకోవడానికి మనం వేసుకున్న టైమ్ టేబుల్ ను కచ్చితంగా పాటించగలుగుతాం.

మనం చేయాల్సిన పనుల్లో ఏది ముఖ్యం, ఏది తర్వాత చేయవచ్చు అనేది మనకు బాగా తెలియాలి. అప్పుడే మనం ఏది చేసినా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. జీవితంలో అన్నీ ముఖ్యమే. ఏది లేకపోయినా లైఫ్ లేదు. కానీ ఏది ముందు చేయాలి, ఏది వాయిదా వేసుకోవాలి అన్నది తెలుసుకోగలగాలి. మన ఫోకస్ ఒక దాని మీదనే ఉండాలి. సినిమాలు, షికార్లు, సోషల్ మీడియాల్లాంటివి మనకు చాలా ఆనందాన్ని ఇస్తాయి. దాని్ని ఉెవ్వరూ కాదనరు. కానీ అవి మన లైఫ్ లో గోల్స్ కావు అన్నప్పుడు వాటిని కొన్ని రోజులు వాయిదా వేయడమే మంచింది. మనం అనుకేున్నది సాధించాక వాటికి ఎంత టైమ్ కేటాయించినా ఏ నష్టమూ ఉండదు. మన లైఫ్ లో ఒత్తిడీ ఉండదు. అన్ని పనులూ ఒకేసారి చేసేయాలి అనుకోవడం అంత తెలివి తక్కువ తనం ఉండదు.

ఇది పరీక్షల సమయం. టెన్త్, ఇంటర్, పోటీ పరీక్షలు అన్నీ ముందున్నాయి. కాబట్టి పైన చెప్పిన ప్రకారం ప్రణాళికతో ఉంటే అన్నీ సక్సెస్ ఫుల్ గా సాధించగలుగుతారు. అనుకున్న తీరాలకు చేరగలుగుతారు.