మన ఊరు -మన ఎంపీ - MicTv.in - Telugu News
mictv telugu

మన ఊరు -మన ఎంపీ

August 23, 2017

నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత బుధవారం బోధన్ మండలం సాలూర గ్రామంలో పర్యటించారు. ఆమె చేపట్టిన మన ఊరు ‘మన ఎంపీ’ కార్యక్రమంలో భాగంగా  సాలూర గ్రామంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆమెకు మహిళలు బొట్టుపెట్టి స్వాగతం పలికారు. టపాసులు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వందలాది మంది యువకులు, మహిళలు కవిత వెంట నడుస్తూ.. తమ ఊరి గురించి తెలియజేశారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను కవిత పరిశీలించారు. ఆ తర్వాత  వాడవాడలా తిరిగిన  గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆ తర్వాత తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. మహిళా భవనం, మినీ బస్ స్టాండ్ నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. గ్రామంలో సీసీ రోడ్డును, గ్రంథాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార బ్యాంక్ భవనాలను కూడా ఆమె ప్రారంభించారు.