Our worst enemy is Modi: KCR
mictv telugu

మన బద్ద శత్రువు మోదీనే: కేసీఆర్‌

August 16, 2022

Our worst enemy is Modi: KCR

తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌‌ జిల్లాలో కాసేపటిక్రితమే టీఆర్ఎస్ కార్యాలయంతోపాటు, కలెక్టరేట్ నూతన భవనాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..”రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలు పడిపోయాయని అప్పట్లో ప్రచారం చేసిండ్రు. తెలంగాణ ఏర్పడకపోతే వికారాబాద్ జిల్లా అయ్యేదా? ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ జిల్లాగా చేశాం. కర్ణాటక, ఏపీలో కంటే ఇప్పుడు ఇక్కడ భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఒక్క ఎకరం భూమి అమ్మితే, పక్క రాష్ట్రాల్లో మూడు ఎకరాల భూమి కొనొచ్చు. సరిహద్దున్న ఉన్నా కర్ణాటక వాసులు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. మా రాష్ట్రంలో కూడా తెలంగాణాలో ఉన్న సంక్షేమ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని అక్కడి వాసులు కోరుతున్నారు. కొత్తగా 10 లక్షల పింఛన్లు ఇవ్వడం ప్రారంభించాం. రైతు బీమా కింద రూ. 5 లక్షలు ఇస్తున్నాం. ప్రాజెక్టులు ఉన్న చోట పన్ను లేకుండా నీళ్లు ఇస్తున్నాం” అని అన్నారు.

అనంతరం ప్రధాని మోదీపై కేసీఆర్ నిప్పులు చేరిగారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రధాని నెరవేర్చలేదు. సాక్ష్యాత్తు ఆయనే మన తెలంగాణకు పెద్ద శత్రువు. నిత్యావసరాలు, ఇంధన వనరుల ధరల పెంపుతో ప్రజలపై భారం మోపారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంటూ ముందుకు వస్తున్నారు. ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రాన్ని నమ్మాల్సిన అవసరం ఉందా?. బీజేపీ సర్కార్ ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధిని ఒకసారి పరిశీలించండి. ఎనిమిదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిందేమిటి?. మన సంక్షేమ పథకాలను ఉచితాల పేరుతో కేంద్రం అవమానిస్తోంది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అనంతరం వికారాబాద్‌, తాండూరు, చేవెళ్లకు కృష్ణా నీళ్లను తెస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కేంద్రం తీరు వల్లే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఆలస్యం అవుతోందన్నారు. రాష్ట్రాలకు మేలు చేయకపోగా పథకాలను రద్దు చేయాలంటున్నారు. గ్యాస్‌, పెట్రోల్‌ ధర గతంలో ఎంత.. ఇప్పుడు ఎంత ఉందో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు.