ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన దారుణాలు అనేకం. ఎన్నో కుటుంబాలలో తీరని విషాదాలను నింపింది. కొత్త కొత్త కష్టాలను తీసుకువచ్చింది. జనాలు గుంపుగా ఉంటే కరోనా వ్యాపిస్తుందనే కారణంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను పెరోల్ మీద బయటకు పంపుతున్న విషయం తెలిసిందే. అలా బయటకు వచ్చిన ఖైదీల్లో హంతకులు, దొంగలు ఉన్నారు. బయటకు వచ్చాక ఓ హంతక దొంగ తన పాతబుద్ధి పోనిచ్చుకోలేదు. ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఓ హత్యకేసులో నిందితుడిగా జైలుశిక్ష అనుభవిస్తున్న విశ్వజిత్ అనే వ్యక్తి కరోనా వైరస్ కారణంగా ఇటీవలే పెరోల్‌పై బయటికి వచ్చాడు. బయటకు వచ్చిన అతడు విక్కీ అనే వ్యక్తితో పేకాట ఆడాడు. ఆటలో డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన విశ్వజిత్ ఆ వ్యక్తిని దారుణంగా హత్యచేశాడు. అనంతరం పోలీసులకు చిక్కకుండా పారిపోయాడని సమాచారం.