రింగు రోడ్డు ఇంకొకర్ని మింగింది ? - MicTv.in - Telugu News
mictv telugu

రింగు రోడ్డు ఇంకొకర్ని మింగింది ?

August 12, 2017

హైదరాబాదు నగరానికి ట్రాఫిక్ ఇబ్బందుల నుండి కాపాడటానికి, రాకపోకలను సులభతరం చేయటానికి చేసిన ఔటర్ రింగ్ రోడ్డు మీద యాక్సిడెంట్లు నిత్య కృత్యమయ్యాయి. తాజగా రాజేంద్రనగర్ లోని హిమాయత్ సాగర్ అవుటర్ రింగ్ సర్వీస్ రోడ్ దగ్గర వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టి యస్ఐ మృతి చెందాడు. కార్లో ఉన్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా హస్పిటల్ కు తరలించారు.

ట్రైనింగ్ లో వున్న ఇతను సెలవులు రావడంతో ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సన్నగా వర్షం కురుస్తున్న కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానాకు పంపుతున్నారు పోలీసులు. చూసారా.. ఇప్పటికి ఔటర్ రింగ్ రోడ్డు ఎంతో మంది ప్రాణాలను మింగింది. చివరికి ఎస్సై కూడా యాక్సిడెంట్లో చనిపోయేసరికి చాలా మందికి మింగుడు పడట్లేదు.

ఔటర్ రోడ్డు వెడల్పుగా విశాలంగా వుందని చాలా మందికి రోడ్డు మీదకు రాగానే ఒంట్లో స్పీడు దయ్యం పూని ఓవర్ స్పీడులో వెళ్తుంటారు. కంట్రోల్ చేస్కుందామంటే సమయానికి వాహనాలు కంట్రోల్ అవక ఇదిగో ఇలాగ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు. క్రికెటర్ అజహరుద్దీన్ కొడుకు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొడుకు, కోట శ్రీనివాసరావు కొడుకు ఇలా చాలా మంది ఔటర్ రింగు రోడ్డు మీద ప్రమాదాలకు గురై తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.

అందుకే ఔటర్ పైన శివాలెత్తే స్పీడు వద్దే వద్దు. ఎక్కడైనా స్లోగా మన జాగ్రత్తలో మనం వెళ్తేనే మన ప్రాణాలు సేఫ్. లేదంటే మనతో పాటు ఎదుటివారి ప్రాణాలకు కూడా ప్రమాదమే కదా ? ఏదేమైనా ఎంతో భవిష్యత్తు వున్న ట్రైనింగ్ ఎస్సై ఇలా అర్థాంతరంగా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోవడం వారి బంధువుల్లో విషాదాన్ని నింపింది.