1900 కేజీల వెండి ఇటుకలు.. బస్సుల్లో దర్జాగా స్మగ్లింగ్ - MicTv.in - Telugu News
mictv telugu

1900 కేజీల వెండి ఇటుకలు.. బస్సుల్లో దర్జాగా స్మగ్లింగ్

May 9, 2022

విధుల్లో భాగంగా ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు చేపట్టిన పోలీసులకు.. వెండి ఇటుకలు, అభరణాలు కనిపించడంతో షాక్ అయ్యారు. వాటిని తరలిస్తున్న డ్రైవర్లను ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం ఇవ్వడంతో వారిని అదుపులోకి తీసుకొని, సుమారు 1900 కేజీల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాలో జరిగింది.

అహ్మదాబాద్ నుంచి ఆగ్రా వెళ్తున్న ప్రైవేట్ బస్సులో.. సోదా చేసిన పోలీసులకు 450 కిలోల బరువున్న వెండి ఇటుకలు, మరో 772 కిలోల వెండి ఆభరణాలు దొరికాయి. బస్సు డ్రైవర్ పొంతన లేని సమాధానం ఇవ్వడం, సరైన పత్రాలు చూపకపోవడంతో మొత్తం 1,222 కిలోల వెండిని సీజ్ చేశారు. వాటి విలువ రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. మరో ఘటనలో.. ఆగ్రా నుంచి గుజరాత్‌కు వెళ్తున్న ప్రైవేటు బస్సులోనూ తనిఖీలు నిర్వహించి 700 కిలోల వెండిని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.