బెలూన్లను ఇతనిలా పగలగొట్టగలరా?
Most people: I guess balloons are ok
Me: pic.twitter.com/urmWxJ5hI2
— Jan Hakon Erichsen (@janerichsen) August 11, 2019
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో.. ఎందుకు వైరల్ అవుతుందో కూడా అర్థం కావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి వరుసగా బెలూన్లను అనేక విధానాల్లో పగలకొడుతున్న వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న జాన్ హకోం ఎరిక్సన్ అనే వ్యక్తి కత్తులను, వివిధ ఆయుధాలను ఉపయోగించి వివిధ పద్ధతుల్లో బెలూన్లను పగులగొడుతున్నాడు.
బెలూన్ పగిలినప్పుడు వచ్చే శబ్దం నుంచు తనను తాను కాపాడుకోవడానికి హెడ్ ఫోన్స్ కూడా ధరించడం గమనార్హం. అయితే జాన్ ఎందుకు అలా చేసాడు అనేది మాత్రం తెలియరాలేదు. ఏదేమైనా ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఆగష్టు 11న పోస్ట్ అయిన ఈ వీడియోకు ట్విట్టర్‌లో 14మిలియన్ల వ్యూస్, 3 లక్షల లైక్‌లు వచ్చాయి. దాదాపు 95000 మంది రీట్వీట్ చేసారు.