'సీఏఏ'పై సుప్రీంలో విచారణ..సర్వత్రా ఉత్కంఠ - MicTv.in - Telugu News
mictv telugu

‘సీఏఏ’పై సుప్రీంలో విచారణ..సర్వత్రా ఉత్కంఠ

January 22, 2020

CVBNM

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతోన్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో సీఏఏపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఈ చట్టాన్ని తీసుకువచ్చారని వివిధ సంస్థలు, సంఘాలు, రాజకీయ పార్టీలు, నాయకులు సుప్రీం కోర్టులో దాదాపు 143 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నెల 10 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై స్టే విధించాలంటూ కూడా కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.

వీటిపై కౌంటర్ దాఖలు చేయాలని డిసెంబర్ 18న ఆదేశించిన సుప్రీం కోర్టు అన్ని పిటిషన్లపై ఈరోజు విచారణ జరుపనుంది. సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన కేరళ ప్రభుత్వం కూడా సుప్రీంలో పిటిషన్ వేసింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత జయరామ్ రమేష్ కూడా సుప్రీంను ఆశ్రయించారు. ఇదిలా ఉంటే.. పౌరసత్వ చట్టంపై ఎవరెన్ని ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గేది లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించి ఉత్కంఠకు తెరలేపారు.