Over 200 Vehicles Crash, Pile Up On China Bridge Amid Heavy Fog
mictv telugu

రెండు వందల వాహనాలు రోడ్డుపై గుద్దుకున్నాయి (వీడియో)

December 28, 2022

Over 200 Vehicles Crash, Pile Up On China Bridge Amid Heavy Fog

ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. కెనాడా, అమెరికాలో మంచు తుఫాన్ భయపెడితే..చైనా వంటి దేశాలను పొగ మంచు కమ్మేస్తోంది. చైనా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తోంది. రహదారులపై ముందు వాహనాలు సైతనం కనిపించడం లేదు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా జెంగ్ జువా నగరంలోని ఓ బ్రిడ్జిపై పొగ మంచు కారణంగా భారీ ప్రమాదం జరిగింది. వందలాది వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటనలో భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. అనేక మంది గాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన రెస్కూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ప్రమాదం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు, ట్రక్కులు ఒకదానిపై ఒకటి పేరుకుపోయినా దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.

మరోవైపు అమెరికాలో మంచు తుఫాన్ ఉధృతి కొనసాగుతుంది. మంచు తుఫాన్ తో పలు ప్రాంతాల్లోని ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీని కారణంగా ప్రాణాలు సైతం పోతున్నాయి. మంచు కారణంగా 100కి పైగా విమానాలను రద్దు చేశారు. ఉష్ణోగ్రతలో మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో కొన్ని ప్రదేశాల్లో నయాగరా జలపాతం గడ్డకట్టింది. ఇళ్లు, రహదారులు పూర్తిగా మంచుతో కప్పబడి దర్శనమిస్తున్నాయి.