పాక్ దేశంలో హిందువుల జనాభా ఎంతంటే.. - Telugu News - Mic tv
mictv telugu

పాక్ దేశంలో హిందువుల జనాభా ఎంతంటే..

June 10, 2022

ముస్లింలు ప్రధానంగా ఉండే పాకిస్థాన్‌లోనూ ముస్లీమేతర ప్రజలు జీవనం సాగిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే వారి సంఖ్య కొద్ది మొత్తంలోనే. తాజాగా నేషనల్ డేటాబేస్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ (NADRA) నివేదిక ఆధారంగా.. ఈ ఏడాది మార్చి వరకు పాకిస్థాన్ లో మొత్తం జనాభా 18,68,90,601 ఉండగా.. వీరిలో 18,25,92,000 మంది ముస్లింలు ఉన్నారు. మిగిలిన వారు మైనార్టీలు. దేశంలోని మొత్తం జనాభాలో మైనార్టీలు ఐదు శాతం కంటే తక్కువగా ఉండగా, వారిలో 1.18 శాతం మాత్రమే హిందువులు జీవనం సాగిస్తున్నారు.

ఎన్‌ఐడీఆర్‌ఏ నివేదిక ప్రకారం, పాక్ దేశంలో నమోదిత హిందువులు 22,10,566 మంది, క్రైస్తవులు 18,73,348మంది, సిక్కులు 74,130మంది, భాయిలు 14,537 వేల మంది, 3,917 మంది పార్సీలున్నారని పాకిస్తాన్‌లో జరిగిన మూడు జాతీయ జనాభా గణన ఆధారంగా నివేదిక పేర్కొంది. బౌద్ధులు 1,787 మంది, చైనీస్ దేశీయులు 1,151మంది, షింటోయిజం అనుచరులు 628, యూదులు 628మంది, ఆఫ్రికన్ మతాల అనుచరులు 1,418 మంది, కెలాషా మతస్థులు 1,522మంది, జైనమతానికి చెందిన వారు ఆరుగురు ఉన్నారు. హిందువుల్లో 95 శాతం మంది దక్షిణ ప్రావిన్స్ సింధ్‌లో నివసిస్తున్నారు.