దేశంలోని మొత్తం కరోనా వైరస్ కేసుల్లో 9,227 కేసులతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అయితే, ఒక్క చెన్నైలోని కోయంబేడు మార్కెట్ లో 2,600 మందికి కరోనా సోకడం గమనార్హం. దీంతో ఆ మార్కెట్ కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా మారింది. కోయంబేడు మార్కెట్లో పని చేస్తున్న కార్మికులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు.
అందులో 2,600 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే 2.6 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. ఇక గడిచిన 24 గంటల్లో తమిళనాడులో కొత్తగా 509 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు తమిళనాడులో కరోనాతో 64 మంది ప్రాణాలు కోల్పోయారు.