Home > Featured > బిగ్‌షాక్.. 19 నుంచి లారీల సమ్మె,  నిత్యావసరాలకు రెక్కలు..

బిగ్‌షాక్.. 19 నుంచి లారీల సమ్మె,  నిత్యావసరాలకు రెక్కలు..

lorries .....

కొత్త మోటార్ చట్టం 2019పై అనేక విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వాహనదారులను పీడించి పిప్పి చేస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దేశంలో ఒక్క రోడ్డు అయినా సరిగ్గా వుందా? ముందు ఆ రోడ్ల పని చూశాక చలానాలు విధించండి మహాప్రభో అంటూ విమర్శిస్తున్నారు. అయితే ఈ కొత్త మోటార్ చట్టానికి వ్యతిరేకంగా లారీ డ్రైవర్లు ఉద్యమించనున్నారు. దేశవ్యాప్త లారీల సమ్మెకు ఆల్ ఇండియా మోటర్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు తమిళనాడు ఫుడ్, ఆయిల్ అండ్ ట్యాంకర్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది.

సమ్మెకు లారీ డ్రైవర్లంతా సహకరించాలని కోరింది. సెప్టెంబర్ 19న ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకు లారీల సమ్మె కొనసాగుతుంది.తమిళనాడు సంఘం కార్యదర్శి జానకిరామన్ మాట్లాడుతూ… ‘అధికంగా ఫైన్‌లు విధిస్తున్నారనే మేము ఈ సమ్మెకు పిలుపునిచ్చాం. కొత్త భారీ జరిమానాలు ఆర్టీఓ అధికారుల జేబులను నింపుకోవటానికి మాత్రమే. అసోసియేషన్ తన విభాగంలో సుమారు 4.75 లక్షల లారీలను కలిగి ఉంది. లారీల సమ్మెతో దేశవ్యాప్తంగా పాలు, కూరగాయలు, ఇంధనం, ఉల్లిపాయలువంటి నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం కలుగుతుంది. అంతేకాకుండా వ్యాపారులు సమ్మె సాకుతో నిల్వలను దాచేసి, ధరలను భారీగా పెంచే అవకాశముంది. 12 గంటల సమ్మె అయినప్పటికీ ముఖ్యంగా పాడైపోయే వస్తువుల విషయానికి వస్తే సరఫరాలో కొరత రెండు రోజులకు విస్తరించవచ్చు’ అని ఆయన తెలిపారు. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేసినందుకు భారీ జరిమానాను విధించడాన్ని యూనియన్ అంగీకరిస్తుందని ఆయన పేర్కొన్నారు.

గతంలో జరిమానాలను.. ఇప్పుడు విధిస్తున్న జరిమానాలకు నింగికి నేలకు వున్నంత వ్యత్యాసం చూపుతున్నారని ఆరోపించారు. ఓవర్ లోడింగ్ చేసినందుకు అప్పుడైతే కిలోగ్రామ్‌కు రూ. 1 ఫైన్ ఉండేదని.. ఇప్పుడు 20వేల ఫైన్‌తో టన్నుకు 2వేలు అదనంగా ఫైన్ విధిస్తున్నారని జానకిరామ్ మండిపడ్డారు. 10 టన్నులు మోసుకెళ్ళే సామర్థ్యం ఉండి, 20 టన్నుల వస్తువులను తీసుకువెళుతున్న లారీకి పూర్తిగా రూ .40,000 జరిమానా విధించబడుతుందని తెలిపారు. అయితే ఓవర్‌ లోడ్ చేసినందుకు జరిమానా విధించడానికి అసోసియేషన్ వ్యతిరేకం కాదని స్పష్టంచేశారు. ఈ జరిమానాలు వారికి లంచంగా మారాయని అన్నారు.

Updated : 17 Sep 2019 10:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top