నిరుద్యోగానికి పెట్టింది పేరైన మనదేశంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉందంటే వందలు, వేలమంది నిరద్యోగులు క్యూ కడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగమైన చెప్పాల్సిన పనేలేదు. స్వీపర్ ఉద్యోగం వచ్చినా సరే జీవితంలో సెటిల్ అయిపోవచ్చని ఆశపడతారు. అధికారంతోపాటు చాన్స్ ఉంటే ‘ఆదాయం కూడా వచ్చే’ పోలీస్ జాబ్స్‌పై ఉండే క్రేజీ సంగతే వేరు. ఏళ్లతరబడి కోచింగ్ తీసుకుంటారు. రేయింబవళ్లు కష్టపడతారు. జాబ్ రాకపోయినా ఇంకోసారి ఇంకోసారి ట్రై చేస్తుంటారు. ఏపీ ప్రభుత్వం వదిలిన ఎస్ఐ జాబ్స్ నోటిఫికేషన్‌కు అప్లై చేసిన నిరుద్యోగుల పరిస్థితి అచ్చం ఇదే. ఒక్క పోస్టుకు ఏకంగా 421 మంది బరిలో నిలిచారు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అయినా ఈ నెల 18కి మొత్తం 1,73,047 దరఖాస్తులు అందాయని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. వీరిలో 1,40,453 మంది పురుషు, 32,594 మహిళలు ఉన్నారు. కానీ పోస్టులు మాత్రం కేవలం 411 ఉన్నాయి. వీటిలో సివిల్ పోలీసు విభాగంలో 315, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ విభాగంలో 96 ఉన్నాయి. గత ఏడాది నవంబరు 28న విడుదల చేసిన నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 5వ నుంచి హాల్ టికెట్లు చేస్తారు. ఫిబ్రవరి 19న ప్రాథమిక పరీక్ష ఉంటుంది.