భారతీయుల ఆయుర్దాయం.. తాజా లెక్కలు ఇవీ..  - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయుల ఆయుర్దాయం.. తాజా లెక్కలు ఇవీ.. 

October 16, 2020

Over the past three decades, India has gained 10 years in life expectancy.jp

ప్రపంచ దేశాల కన్నా  మన భారతీయుల ఆహారపు అలవాట్లు చాలా భిన్నంగా ఉంటాయి. కరోనా వైరస్ సమయంలో మనం నిత్యం కూరల్లో వాడే పసుపును చాలా దేశాలవారు తినసాగారు. పసుపులో యాంటీ  బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. మునుపు నుంచే వాడుతున్న ఇండియన్స్‌లో రోగనిరోధక శక్తి బాగానే ఉంటుందని అభిప్రాయపడ్డారు.  ఈ నేపథ్యంలో భారతీయుల ఆయుర్దాయం గతంలో కన్నా ఇప్పుడు బాగా పెరిగిందని ఓ వైద్య పత్రిక వెల్లడించింది. గత 30 ఏళ్లలో భారతీయులు ఆయిశ్శు పెంచుకున్నారని తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాత వైద్య పత్రిక లాన్సెట్ జర్నల్ తన తాజా నివేదికలో ఈ ఆసక్తికర విషయాలను పంచుకుంది. భారతదేశ ప్రజల సగటు ఆయుర్దాయం 70.8 ఏళ్లకు పెరిగిందని తన తాజా నివేదికలో పేర్కొంది. 90వ దశకంలో భారతీయుల సగటు ఆయుష్షు 59.6గా ఉందని, 2019 నాటికి అది గణనీయంగా పెరిగిందని స్పష్టంచేసింది. 

మరోపక్క భారత్‌లోని వివిధ రాష్ట్రాల ప్రజల సగటు ఆయుష్షులో మాత్రం ఎత్తుపల్లాలు ఉన్నాయని లాన్సెట్ తెలిపింది. కేరళలో సగటు జీవితకాలం 77.3 ఏళ్లకు పెరగ్గా, యూపీలో ఓ వ్యక్తి సగటు ఆయుష్షు 66.9గా ఉందని చెప్పింది. లాన్సెట్ నివేదికపై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ స్పందిస్తూ.. ‘భారతీయుల సగటు ఆయుర్దాయం పెరిగినప్పటికీ వారు సంతోషంగా జీవిస్తున్నట్టు భావించలేం. వారు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. భారత ప్రజలు అనుకున్నంత ఆరోగ్యంగా లేరు’ అని వివరించింది.