ఓవర్ లోడ్ వద్దురా అయ్యా అని నెత్తీ నోరూ కొట్టుకుంటున్నా కొందరు డ్రైవర్లు లెక్క చెయ్యడం లేదు. వారి నిర్లక్ష్యం, దురాశ ఫలితంగా ఎన్నో విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 20 మంది ప్రయాణికులను తీసుకెళ్తున్న ఓ ఆటో అదుపు తప్పి పందిని ఢీకొట్టింది. వేగంగా వస్తుండడం, పంది కూడా గట్టిది కావడంతో ఆటో తిరబడింది. అందులోని ప్రయాణికుల్లో ఒకరు చనిపోయారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూరు మండడంలో ఈ ప్రమాదం జరిగింది.
యములోనిపల్లి నుంచి వ్యవసాయ కూలీలతో వస్తున్న ఆటో వ్యవసాయ మార్కెట్ యార్డు దగ్గర వరాహాన్ని ఢీకొట్టింది. ఆ మూగజీవి ఆకస్మికంగా రోడ్డుకు అడ్డంగా రావడంతో డ్రైవర్ తికమకపడి సడన్ బ్రేక్ వేశాడు. ఓ ప్రయాణికురాలు అక్కడికక్కడే చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మంది కూలీలను ఎక్కించుకున్నాడు. పోలీసులు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.