అధిక ధరలకు అమ్ముతుంటే 1902కు ఫిర్యాదు చేయండి - MicTv.in - Telugu News
mictv telugu

అధిక ధరలకు అమ్ముతుంటే 1902కు ఫిర్యాదు చేయండి

March 25, 2020

Overprice

శవాలపై పేలాలు ఏరుకునే జనం అన్నిచోట్లా ఉంటారు. కరోనా దీనికి అద్దం పడుతోంది. ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ ప్రకటించడంతో కొందరు వ్యాపారులు కక్కుర్తితో ధరలను అమాంతం పెంచేశారు. రైతుల వద్ద కారుచవగ్గా కొనేస్తూ ప్రజలకు భారీ ధరలకు అమ్ముతున్నారు. ఉగాది పండగ కూడా కలిసి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో వారి దోపిడీకి అడ్డుకట్ట లేకుండా పోతోంది. మొన్నటివరకు కిలో రూ. 10 పలికిన టొమేటాను ఇప్పుడు రూ. 60కి అమ్ముతున్నారు. కొన్నిచోట్ల వంద కూడా పలికింది. కొబ్బరికాయను 50కి అమ్ముతున్నారు. 

ఇప్పటికే పనులు కోల్పోయి ఇళ్లకే పరిమితమైన జనం ఈ ధరలు తట్టుకోలేక లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన బియ్యం, వెయ్యి రూపాయలు ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులోనూ ఆమ్యామ్యా గాళ్లు తయారైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంటోంది. సీఎం జగన్ ఈ రోజు అధికారులతో లాక్ డౌన్‌పై సమీక్ష నిర్వహించారు.  నిత్యావసరాలను ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన ధరలు చర్యలు తీసుకుంటామని ఆయన వ్యాపారులను హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్ముతుంటే 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆళ్ల నాని తెలిపారు. వచ్చే నెల 4వ తేదీని తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం పంపిణీ ఉంటుందన్నారు.