ఏడ్చేస్తూ, పౌరసత్వ బిల్లును చించేసిన ఒవైసీ - MicTv.in - Telugu News
mictv telugu

ఏడ్చేస్తూ, పౌరసత్వ బిల్లును చించేసిన ఒవైసీ

December 9, 2019

amendment 01

వివాదాస్పద పౌరసత్వ బిల్లు రాజ్యాంగానికి, ప్రాథమిక హక్కులను విరుద్ధమని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం లోక్‌సభలో బిల్లుపై జరిగిన చర్చలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ బిల్లుతో దేశాన్ని విభజించేందుకు యత్నిస్తున్నారంటూ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. ఉద్వేగం తట్టుకోలేక కంటతడి కూడా పెట్టుకున్నారు. 

ఈ బిల్లును ఆమోదం పొందితే.. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేరు నియంతలైన హిట్లర్‌, డేవిడ్ బెన్ గురియన్ పక్కన చేరుతుందని అన్నారు. ‘ఈ బిల్లుతో మన దేశంతోపాటు మన హోంమంత్రినీ రక్షించాలని కోరుతున్నాను. లేకపోతే జర్మనీ, ఇజ్రాయెల్‌లలో జాతి ప్రాతిపదికన క్రూరచట్టాలు చేసిన హిట్లర్, డేవిడ్ బెన్‌ల జాబితాలో అమిత్ షా పేరుకూడా చేరుతుంది’ అని అన్నారు. ఈ బిల్లు రాజ్యాంగాన్ని, లౌకికత్వాన్ని కాలరాసే బిల్లును తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని కంటతడి పెట్టుకున్నారు. స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. ‘మీరు అమర్యాదగా మాట్లాడుతున్నారు’ అని ఆక్షేపించారు.