Owaisi Fumes Over Central Government's Decision To Rename Aurangabad And Osmanabad
mictv telugu

‘ఔరంగాబాద్’ నగరం పేరు మార్పు.. కేంద్రంపై మండిపడ్డ ఒవైసీ

February 25, 2023

Owaisi Fumes Over Central Government's Decision To Rename Aurangabad And Osmanabad

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నగరాన్ని ‘ఛత్రపతి శంభాజీనగర్’గా మరియు ఉస్మానాబాద్ నగరాన్ని ‘ధరాశివ్’గా మార్చడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. దీనిపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. హిందువులు మరియు ముస్లింల మధ్య వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. ఔరంగాబాద్ పేరు మార్చే నిర్ణయంపై రేపు విలేకరుల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మతపరమైన వివక్షను సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, దేశంలోని హిందువులు, ముస్లింలను విభజించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు.
ముస్లింల‌పై కొంద‌రు కావాలనే ద్వేష‌భావాన్ని వ్యాపింప చేస్తున్నార‌ని, కానీ అలాంటి వారిపై ఎటువంటి చ‌ర్య‌లు ప్ర‌భుత్వం తీసుకోవ‌డం లేద‌న్నారు. భార‌త్ జోడో యాత్ర‌లో రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం దేశం అంతా పాల్గొన్న‌ద‌ని, అల్వార్‌లో జ‌రిగిన రాయ‌ల్ వెల్డింగ్‌లోనూ పాల్గొన్న‌ద‌ని, కానీ జునైద్‌, నాసిర్‌ల‌ను చంపిన చోటుకు ఆ ప్ర‌భుత్వం వెళ్ల‌లేక‌పోయిన‌ట్లు అస‌ద్ ఆరోపించారు.

వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఔరంగ‌బాద్ నుంచి త‌మ పార్టీ పోటీ చేయ‌నున్న‌ట్లు అస‌దుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్‌తో పాటు ఇత‌ర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నామ‌ని, ఎవ‌రితో పొత్తు కుదుర్చుకోవాల‌న్న దానిపై కూడా కొన్ని పార్టీల‌తో సంప్ర‌దింపుల్లో ఉన్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అయితే ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటామ‌నే దానిపై ఇంత త్వ‌ర‌గా వెల్ల‌డించ‌లేమ‌ని తెలిపారు. తెలంగాణ‌లో 2014, 2018 ఎన్నిక‌ల్లో బీజేపీ ఓడిపోయింద‌ని, ఈ ఏడాది డిసెంబ‌ర్‌లోనూ ఆ పార్టీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని అస‌ద్ అన్నారు. ప్రాంతీయ పార్టీల‌తో క‌లిసి బీజేపీని ఓడించ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.