Owaisi reacts on PFI ban
mictv telugu

పీఎఫ్ఐ నిషేధంపై స్పందించిన ఓవైసీ.. ఆ చట్టాన్ని మార్చాలని డిమాండ్

September 28, 2022

కేరళలో ప్రధాన కార్యాలయంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఎఫ్ఐని కేంద్రం ఐదేళ్లు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ నిషేధంపై ఎంఐఎం అధినేత, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆ సంస్థ విధానాలను తాను వ్యతిరేకించానని, కానీ, కేంద్రం విధించిన నిషేధం సరికాదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు పీఎఫ్ఐ నిషేధించబడింది. కానీ, ఖాజా అజ్మేరీ బాంబు పేలుళ్ల దోషులతో సంబంధం ఉన్న సంస్థలను ఎందుకు నిషేధించలేదు. మితవాద మెజారిటీ సంస్థలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఇవే కాక, ఉపా చట్టంపై కూడా ఆయన తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. వాజ్‌పేయ్ హయాంలో తెచ్చిన ఈ చట్టాన్ని యూపీఏ కాలంలో సవరణ చేస్తూ మరింత కఠినంగా మార్చారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం దానిని మరింత కృూరంగా మార్చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ కూడా దీనికి మద్ధతు తెలిపిందని గుర్తు చేశారు. స్వేచ్ఛగా అభిప్రాయాన్ని తెలియజేసే ముస్లింల హక్కుపై ఈ చట్టం నిషేధం లాంటిదని ఆరోపించారు. ఈ చట్టం ద్వారా పీఎఫ్ఐ కరపత్రం పట్టుకున్న ప్రతి ముస్లిం యువకుడిని అరెస్ట్ చేస్తున్నారని, ఇప్పటికే చాలామంది ముస్లిం యువకులు జైళ్లలో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.