Owaisi says he will never support any law mandating only 2 children
mictv telugu

ఇద్దరు పిల్లల చట్టం తీసుకొస్తే భారత్‌కు చైనా గతే.. ఒవైసీ

July 14, 2022

Owaisi says he will never support any law mandating only 2 children

ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలనే చట్టం తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్ధించబోనని అన్నారు ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం జనాభా నియంత్రణ కోసం చట్టం రూపొందిస్తుందన్న ప్రచారంపై స్పందించారు. చైనా చేసిన పొరపాటే భారత్ తిరిగి చేయొద్దన్నారు. జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలనే చట్టం తీసుకొస్తే ఎట్టి పరిస్థితుల్లో సమర్ధించబోనని తెలిపారు. ఆ చట్టం దేశానికి ఎంతమాత్రం మంచిది కాదని, దీని కారణంగా 2030కల్లా దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని చెప్పారు. అది జనాభాను స్థిరంగా ఉంచుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ అంశంపై గతంలో కూడా మాట్లాడారు అసదుద్దీన్. దేశంలో ముస్లింలే ఎక్కువగా గర్భనిరోధక సాధనాలు వాడుతున్నారని.. జనాభా పెరుగుదలకు ముస్లింలను మాత్రమే బాధ్యుల్ని చేయడం సరికాదన్నారు. ముస్లింలు భారతీయులు కాదా? అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. ద్రవిడియన్లు, గిరిజనులు మాత్రమే అసలైన భారతీయులా అని నిలదీశారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎలాంటి చట్టాలు లేకుండానే 2026-2030 కల్లా జనాభా నియంత్రణలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. కొంతకాలంగా దేశంలో జనాభా నియంత్రణ కోసం కఠిన చట్టాలు తేవాలనే ప్రచారం జరగుతోంది. జనాభా నియంత్రణలో భాగంగానే రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్, అసోం, ఒడిశాలు ఇద్దరు పిల్లలకు మించి ఉన్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తీసుకొచ్చారు.