Owaisi was pelted with stones while traveling in Vande Bharat
mictv telugu

వందేభారత్‌‌లో ప్రయాణిస్తున్న ఓవైసీపై రాళ్లదాడి! ఎస్పీ ఖండన

November 8, 2022

Owaisi was pelted with stones while traveling in Vande Bharat

ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌‌‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఆప్ పార్టీలు ముందుండగా.. తాజాగా అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఎంఐఎం కూడా తన ప్రచారాన్ని మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో ఓవైసీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన సోమవారం వందే భారత్ రైలులో అహ్మదాబాద్ నుంచి సూరత్‌‌ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఓవైసీపై రాళ్ల దాడి జరిగిందని ఆ పార్టీ జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. సూరత్‌‌‌‌‌‌‌లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు వెళ్తుండగా, కొందరు రాళ్లదాడికి పాల్పడ్డారని, వాటికి సంబంధించిన ఫోటోలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. రాళ్ల దాడిలో రైలు అద్దాలు పగులగొట్టారని ఆ ఫోటోలను రివీల్ చేశారు. అయితే ఎంఐఎం ఆరోపణలను పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్ ఖండించారు. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నాయని, రైలు వేగానికి కొన్ని రాళ్లు ఎగిసి పడ్డాయని తెలిపారు. ఓవైసీ కిటికీకి దూరంగానే కూర్చున్నారని, ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. దెబ్బతిన్న కిటికీని మార్చి కొత్తది పెట్టామని, ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.