చదువు లేని సంఘీలు, మదర్సాల్లో అలా కాదు.. ఒవైసీ విమర్శలు - MicTv.in - Telugu News
mictv telugu

చదువు లేని సంఘీలు, మదర్సాల్లో అలా కాదు.. ఒవైసీ విమర్శలు

May 24, 2022

ముస్లిం విద్యార్థులకు ఖురాన్ నేర్పించండి కానీ మదర్సాలు వద్దంటూ అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిస్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అనేక మదర్సాలు ఇస్లాంతోపాటు సైన్స్, మ్యాథ్స్ మరియు సోషల్ సబ్జెక్ట్‌లను కూడా బోధిస్తున్నాయని తెలిపారు.

ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అస్సాం సీఎం.. ‘మదర్సాలలో ఖురాన్‌ను బోధించాల్సిన అవసరం ఏంటని, మీ పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్ట్‌లు కావాలంటే సైన్స్, మాథ్స్, బయోలజీ, బోటనీ, జూలజీ లాంటివి చదవాలని ముస్లింలను ఉద్దేశించి అన్నారు. ఈ చదువులు అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉన్నాయని, ఖురాన్‌లు బోధించే మదర్సాలు అక్కర్లేదని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఓవైసీ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘మదర్సాల్లో శాఖల్లాగా కాదని, సబ్జెక్ట్‌లతోపాటు ఆత్మగౌరవాన్ని, సానుభూతి నేర్పిస్తారన్నారు. చదువులేని సంఘీలకు ఇది అర్థం కాదని చెప్పారు. హిందూ సంఘసంస్కర్త రాజా రాం మోహన్ రాయ్ చదువుకున్నది మదర్సాలోనే అన్న విషయాన్ని గుర్తు చేస్తూ… ఆయన అక్కడ ఎందుకు చదువు చదువుకున్నారో వాళ్లకి అర్థం కాదని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ముస్లింలు పోరాడుతుంటే సంఘీలు ఆ సమయంలో బ్రిటిషు ఏజెంట్లలా వ్యవహరించారని ఓవైసీ అన్నారు.