కియా కారుపై యాజమాని ఆగ్రహం.. రూ.19 లక్షలతో చెత్తను.. - MicTv.in - Telugu News
mictv telugu

కియా కారుపై యాజమాని ఆగ్రహం.. రూ.19 లక్షలతో చెత్తను..

May 31, 2022

కియా కార్ల కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కార్ల ప్రియులు ఒక్కసారైన కియా కంపెనీ తయారుచేసిన కారును డ్రైవ్‌ చేయాలని తెగ కళలు కంటారు. అలాంటి కియా కారుపై ఓ యాజమాని కోపంతో వాహనం వెనుక భాగాన ‘కియా కార్లను కొనకండి – మోసపోకండి’ అంటూ ఓ బ్యానర్‌ను కట్టి కారును ఊరేగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్‌లో ఉన్న కియా ప్రధాన కార్యాలయం చుట్టూ “కియా కార్లు కొనాలనుకునేవారు అప్రమత్తంగా ఉండండి. నేను కియా చెత్తను రూ. 19 లక్షలకు కొన్నాను” అని బ్యానర్ కట్టి, ఆ బ్యానర్లలో ఫోన్ నంబర్‌ను రాసి ఓ వ్యక్తి తన కారును నడిపాడు. కచ్చితమైన కారణం ఏమిటో తెలియదు గాని, ఆ వ్యక్తి కియా అధికారుల దృష్టిలో పడేందుకే ఇలా చేశాడని పలువురు అభిప్రాయపడ్డారు. కియా కారు పట్ల ఎందుకు అతడు అసంతృప్తి చెందాడో?, ఎందుకలా కారును కార్యాలయం చుట్టూ తిప్పాడో? ఎలాంటి సమాచారం లేకపోవటంతో పలువురు వాహనదారులు అర్థంకాక సతమతమవుతున్నారు.

గతంలో ఇదే విధంగా టొయోటా అర్బన్ క్రూయిజర్ కారు విషయంలో ఓ యజమాని ఊరేగింపు చేశారు. వివిధ కారు తయారీదారుల సేవలపై అసంతృప్తిగా ఉన్న అనేకమంది యజమానులు వినూత్న రీతిలో తమ నిరసనను తెలియజేశారు. ఫోర్డ్ ఎండీవర్, స్కోడా ఆక్టావియా, ఎంజీ హెక్టర్, హై-ఎండ్ లగ్జరీ, జాగ్వార్ ఎస్ఎఫ్ వంటి కార్లు కూడా అనేక విమర్శలకు గురైయ్యాయి. ఇప్పుడు కియా కారుపై జరుగుతున్న ప్రచారం నెట్టింట చక్కర్లు కొడుతుంది.