మాస్కుల గోల పెంపుడు జంతువులకు తప్పలేదు - MicTv.in - Telugu News
mictv telugu

 మాస్కుల గోల పెంపుడు జంతువులకు తప్పలేదు

February 18, 2020

cf vb

చైనాను పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రజలను వణికిస్తోంది. దీని భారి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రజలు మృత్యువాతపడ్డారు.ఇంకా అరవై వేలకు పైగా మంది ఆస్పత్రుల్లోనే చికిత్స పొందుతున్నారు. ఈ వైరస్ నుంచి కాపాడుకునేందుకు ప్రజలు రకరకాల ఫీట్లు చేస్తున్నారు. సానిటైజర్లు, ఫేస్‌ మాస్క్‌లు ధరిస్తే కానీ బయట అడుగుపెట్టడం లేదు. 

ప్రజలు అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు వస్తున్నారు. ఇప్పటి వరకు ఇలా బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు మాస్కులు ధరించే కాలు బయటపెడుతున్నారు. కానీ తాజాగా ఈ పరిస్థితి పెంపుడు జంతులకు కూడా వచ్చింది. ఇళ్లల్లో పెంచుకునే పెంపుడు జంతువులకు కూడా ఈ మాస్క్‌లు ధరిస్తున్నారు. పిల్లులు, కుక్కలకు కూడా మాస్క్‌లు ధరించి బయటకు తీసుకొస్తున్నారు. కరోనా నుంచి కాపాడుకునేందుకు ఇలా చాలా మంది యజమానులు చేస్తున్నారు. తాజాగా ఓ పిల్లి ఫేస్‌ మాస్క్‌తో రోడ్లపై తిరుగుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.