ox attack in tuni district Ap, 6 injured
mictv telugu

కనబడిన వాళ్లందర్నీ కుమ్మేస్తున్న ఎద్దు.. ఆరుగురికి తీవ్ర గాయాలు

July 22, 2022

ox attack in tuni district Ap, 6 injured

ఏపీలోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఓ ఎద్దు హల్‌చల్‌ చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ వీధుల వెంట తిరుగుతూ కనబడిన జనాలందరినీ కుమ్మేస్తోంది. పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకు 10 మందిపై ఎద్దు దాడి చేయడంతో వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎద్దును బంధించేందుకు పశుసంవర్ధక, పురపాలక శాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా ఎద్దు దొరకడం లేదు.