ఇండియాపై ఓవైసీ హాట్ కామెంట్స్.. ఇది నా దేశం కాదు - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియాపై ఓవైసీ హాట్ కామెంట్స్.. ఇది నా దేశం కాదు

May 29, 2022

ఏఐఎమ్ఎమ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ భారతదేశం నాది కాదు, థాక్రే, ప్రధాని మోదీ-అమిత్ షాలది అసలే కాదు’ అని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. మహారాష్ట్ర భివాండీలో ఓవైసీ శనివారం పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ..” ఇండియా నాది కాదు, థాక్రే, ప్రధాని మోదీ-అమిత్ షాలది అసలే కాదు. మొఘలుల తర్వాత ఇండియా ఎవరికైనా చెందింది అంటే అది ఒక్క ద్రవిడియన్లకే, ఆదివాసీలకు మాత్రమే చెందుతుంది. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుంచి వచ్చిన వలసదారుల వల్ల ఇండియా ఏర్పడింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల వల్ల కాదు. దేశంలోకి మొఘలులు వచ్చి వెళ్లిన తర్వాతే, ఆర్ఎస్ఎస్, బీజేపీలు వెలుగులోకి వచ్చాయి” అని ఆయన అన్నారు.

 

అనంతరం శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అరెస్టుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి యాక్షన్ తీసుకోవద్దని ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రధాని నరేంద్రమోదీని కలిసిన ఘటనను ఆయన గుర్తు చేస్తూ.. ఎన్‌సీపీ కార్యకర్తలను ప్రశ్నించారు. ‘సంజయ్ రౌత్‌కు చేసినట్లు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్టు విషయంలో ప్రధాని మోదీని శరద్ పవార్ ఎందుకు కలవలేదు?. నవాబ్ మాలిక్ ముస్లీం కావడం వల్లేనా?. సంజయ్ రౌత్ కంటే నవాబ్ మాలిక్ తక్కువనా? సంజయ్, నవాబ్ ఇద్దరూ సమానం కాదా? అని ఓవైసీ అన్నారు.