ఓయో కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాళ్లందరికి ఉచిత వసతి - MicTv.in - Telugu News
mictv telugu

ఓయో కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాళ్లందరికి ఉచిత వసతి

May 20, 2022

ఓయో కస్టమర్లకు గుడ్ న్యూస్. రెగ్యులర్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది ఓయో. గోల్డ్ కార్డ్ కలిగి ఉన్న కస్టమర్ ఎవరైనా వారి హోటళ్లలో వరుసగా 5 రోజులు బస చేస్తే, ఆరో రోజున ఉచితంగానే ఉండే అవకాశం కల్పిస్తోంది. ఏడాదికి ఒకసారి ఈ సౌకర్యం లభిస్తుంది. అదే సిల్వర్, బ్లూ కస్టమర్లు అయితే వరుసగా 7 రోజులు, 8 రోజులు ఉండాల్సి ఉంటుంది. అప్పుడు వీరికి కూడా ఒక రోజు ఉచిత నివాసం లభిస్తుంది. దేశంలో కరోనా సంక్షోభం తర్వాత ట్రావెల్ రంగాన్ని బలపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఫ్రీ రూమ్ నైట్ ఆఫర్ కేవలం గోల్డ్ సభ్యులకు మాత్రమే వర్తిస్తుంది. లాయల్టీ ప్రోగ్రామ్ విజార్డ్ కింద రిజిస్టర్ అయిన గోల్డ్ సభ్యులకు ఈ ఆఫర్ ఉంటుంది.

ఇంకా భారత్‌లో తరుచుగా ప్రయాణం చేసే వారి కోసం కంపెనీ ఓయో విజార్డ్ హోటల్స్‌లో 10 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. గోల్డ్ కార్డ్ కస్టమర్స్ పే ఎట్ హోటల్ ఫెసిలిటీ కలిగి ఉంటారు. కాబట్టి బుకింగ్స్ కోసం ముందుగానే డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. అంతేకాకుండా ఓయో మరో 13 ప్రముఖ బ్లాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. డొమినోస్, లెన్స్‌కార్ట్, రెబెల్ ఫుడ్స్, గానా వంటివి ఇందులో ఉన్నాయి. ఒప్పందంలో భాగంగా డిస్కౌంట్ కూపన్లు, వోచర్లు పొందొచ్చు.