Oyo gives 60% discount .. Offer valid for a week
mictv telugu

ఓయో 60 శాతం డిస్కౌంట్.. వారం పాటు ఆఫర్

June 24, 2022

Oyo gives 60% discount .. Offer valid for a week

ప్రముఖ ఆతిథ్య సేవల సంస్థ ఓయో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ పరిధిలోని హోటళ్లలో రూమ్స్ బుక్ చేసుకున్న వారికి 60 శాతం డిస్కౌంటును ఇస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఈ నెల 27 నుంచి వచ్చే నెల 3 వరకు ఉంటుందని వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు. కేవలం చిరు, మధ్య తరగతి వ్యాపారస్తులకే. జూన్ 27న ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ పరిమిత కాల ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఒయో రూమ్స్ బుక్ చేసుకునే వారితో వీరి వాటానే ఎక్కువగా ఉందట. అందుకే కంపెనీ ఈ ఆఫర్ పెట్టిందంట. వ్యాపారస్తులు రిసెప్షన్‌లో తమ బిజినెస్ కార్డును చూపిస్తే సరిపోతుంది. దేశ వ్యాప్తంగా 2 వేల ఓయో ప్రాపర్టీలలో ఉన్న 10 వేల గదులు ఈ ఆఫర్‌లో అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఓయో యాప్, వెబ్‌సైట్, ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫాంల ద్వారా ఆఫర్ పొందొచ్చని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీరంగ తెలిపారు.